Breaking News

డబ్బుల్లేవన్న ఓటీటీ.. కట్‌ చేస్తే జాతీయ అవార్డులు!

Published on Sun, 11/23/2025 - 13:31

12th ఫెయిల్‌ (12th Fail Movie).. అందరినీ కంటతడి పెట్టించిన సినిమా. అందరి మనసులు గెల్చుకున్న మూవీ. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ముందు దీన్ని కొనేందుకు ఓటీటీలు వెనకడుగు వేశాయంటున్నాడు బాలీవుడ్‌ దర్శకుడు విధు వినోద్‌ చోప్రా (Vidhu Vinod Chopra). ఈయన ఇప్పటితరానికి 12th ఫెయిల్‌ డైరెక్టర్‌గా తెలుసు.. కానీ ఇతడు పరిండా, 1942:ఎ లవ్‌ స్టోరీ వంటి హిట్‌ సినిమాలను తెరకెక్కించాడు. వినోద్‌ చోప్రా తాజాగా 56వ ఇఫీ(ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకకు హాజరయ్యాడు. 

థియేటర్‌లో రిలీజ్‌ చేయొద్దన్నారు
'అన్‌స్క్రిప్ట్‌డ్‌: ద ఆర్ట్‌ అండ్‌ ఎమోషన్‌ ఆఫ్‌ ఫిలింమేకింగ్‌' పేరిట జరిగిన చర్చలో విధు వినోద్‌ చోప్రా మాట్లాడుతూ.. 12th ఫెయిల్‌ తీసినప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వర్కవుట్‌ కాదన్నారు. నా భార్యతో సహా అందరూ దీన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేయొద్దన్నారు. ఇలాంటి సినిమాను ఎవరూ వెళ్లి చూడరని చెప్పారు. ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం.. జనాలు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం నాకుందన్నాను.

దర్శకుడు విధు వినోద్‌ చోప్రా

డబ్బుల్లేవన్న ఓటీటీ
నా నమ్మకం నిజమైంది. థియేటర్లలో ఏడు నెలలపాటు ఆడింది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయితే సినిమా చూశాక తమ దగ్గర కొనేంత డబ్బు లేదని చెప్పింది. మీకు సినిమా అర్థం కాలేదేమో అన్నాను. అందుకో వ్యక్తి.. సినిమాలో చూపించిన మనుషులు నిజ జీవితంలో ఉండరు అన్నాడు. అలా వారు మా సినిమాను కొనేందుకు ఇష్టపడలేదు అని గుర్తు చేసుకున్నాడు. తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్టవడం జియో హాట్‌స్టార్‌లో రిలీజవడం చకచకా జరిగిపోయాయి. 

జాతీయ అవార్డులు 
మొన్నటి మొన్న  (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో)  రెండు జాతీయ అవార్డులు సైతం సాధించింది. 12th ఫెయిల్‌ మూవీ విషయానికి వస్తే ఇందులో విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో నటించగా మేధా శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ- ఐఆర్‌ఎస్‌ అధికారిణి శ్రద్ధా జోషిల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2023 అక్టోబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: చెత్త అమ్ముకునేవాడిని..షాప్‌ అమ్ముకునే దుస్థితి: జబర్దస్త్‌ కమెడియన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)