Breaking News

సంక్రాంతి రేసులో అజిత్‌

Published on Thu, 09/12/2024 - 06:47

నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి విడాముయర్చి. నటుడు అర్జున్, త్రిష, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్‌తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం దీపావళికి తెరపైకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే నిర్మాణ కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని 2025 పొంగల్‌కు విడుదల చేయడానికి నిర్మాతల వర్గం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 

కాగా అజిత్‌ నటిస్తున్న మరో చిత్రం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులోనూ నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2025 పొంగల్‌కు విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. 

కాగా ఇప్పుడు ఆ తేదీన విడాముయర్చి తెరపైకి రానుండడంతో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం విడుదల తేదీ మారే అవకాశం ఉంది. దీన్ని  వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా విడాముయర్చి చిత్రం విడుదలనంతరం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్ర విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల విడుదలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.   

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)