Breaking News

క్యాన్సర్‌తో పోరాటం.. ట్రీట్‌మెంట్‌ పనిచేయక నటుడు మృతి

Published on Tue, 06/03/2025 - 11:38

బుల్లితెర నటుడు విభు రాఘవ్‌ క్యాన్సర్‌తో సోమవారం (జూన్‌ 2న) కన్నుమూశాడు. పెద్దపేగు క్యాన్సర్‌తో పోరాడి అలిసిపోయిన అతడు ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆరువారాల క్రితం తన అనారోగ్యం గురించి అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో క్లిప్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఫలించని ట్రీట్‌మెంట్‌
జనవరిలో కీమోథెరపీ మొదలుపెట్టాం. నాలుగు రౌండ్లయ్యాక ఓ స్కాన్‌ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే నాకు ఇస్తున్న ట్రీట్‌మెంట్‌ ఏమాత్రం పనిచేయడం లేదు. క్యాన్సర్‌ నియంత్రణలో ఉండటం కాదుకదా ఏకంగా శరీరమంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు వేరే చికిత్స మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో చూడాలి. నాకు మీ ప్రేమాభిమానాలు కావాలి. అదొక్కటే నేను మీనుంచి ఆశించేది అని చిరునవ్వుతో వీడియో ముగించాడు. ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు.. నీ పెదాలపై ఆ నవ్వు అలాగే ఉండాలి.. నీకంతా మంచే జరుగుతుంది, ఈసారైనా ట్రీట్‌మెంట్‌ విజయవంతం కావాలి అని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు.

పెద్ద పెగే క్యాన్సర్‌తో పోరాటం
విభు అసలు పేరు వైభవ్‌ కుమార్‌ సింగ్‌ రాఘవ్‌. నిషా ఔర్‌ ఉస్కే కజిన్స్‌, సావధాన్‌ ఇండియా.. ఇలాంటి పలు షోలలో కనిపించాడు. 2022లో పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడ్డాడు. ఈ మధ్యే అతడి పరిస్థితి విషమించడంతో సెలబ్రిటీలు అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయమని అర్థించారు. గతవారం సైతం నటి సింపుల్‌ కౌల్‌.. విభును కాపాడుకుందామంటూ తోచినంత సాయం చేయమని అభిమానులను కోరింది. కానీ ఇంతలోనే విభు ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

 

 

చదవండి: ‘గద్దర్‌ అవార్డ్స్‌’ లో తెలంగాణకు అన్యాయం: ప్రతాని రామకృష్ణ గౌడ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)