Breaking News

జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబో.. క్లారిటీ ఇదే!

Published on Wed, 04/12/2023 - 13:10

కొద్ది రోజులుగా కోలీవుడ్​ స్టార్​ దర్శకుడు​ వెట్రిమారన్‌- జూనియర్​ ఎన్టీఆర్​ కాంబోలో మూవీ రానున్నట్ల నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. వెట్రిమారన్​ డైరెక్షన్‌లో యంగ్​ టైగర్​ నటించేందుకు ఎన్టీఆర్‌ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేశారా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. తాజాగా విషయంపై స్పందించిన డైరెక్టర్​​ క్లారిటీ ఇచ్చారు. విడుదల పార్ట్‌-1 తెలుగులో రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తమిళంలో విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన విడుదలై: పార్ట్‌1 ప్రేక్షకులను అలరిస్తోంది. 

వెట్రిమారన్ మాట్లాడుతూ..' 'అసురన్‌' మూవీ తర్వాత లాక్‌డౌన్‌ ముగిశాక ఎన్టీఆ‍ర్‌ను కలిశా. మేమిద్దరం చాలా విషయాలు చర్చించుకున్నాం. అయితే ఆయనతో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. అంతే కాకుండా ఏ కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రావాలన్న విషయంపై నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కేవలం స్టార్‌ వాల్యూ, కాంబినేషన్‌ మాత్రమే కాకుండా తాను ఎంచుకునే కంటెంట్‌ డిమాండ్‌ చేస్తే అతడితో సినిమా చేస్తా.' అంటూ వెట్రిమారన్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

వెట్రిమారన్ ప్రస్తుతం విడుదల:పార్ట్‌1'కు సీక్వెల్‌గా 'పార్ట్‌2' తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత సూర్యతో 'వాడివాసల్' అనే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ కూడా ఎన్టీఆర్30 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్​ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే ఎన్టీఆర్‌, వెట్రిమారన్‌ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)