Breaking News

సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు నానా పటేకర్‌ మృతి..

Published on Thu, 10/08/2026 - 07:37

బాలీవుడ్‌ సీనియర్ నటుడు, ప్రముఖ రంగస్థల కళాకారుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం ఉదయం గోవాలో గుండెపోటుతో మృతి చెందారు. నానా పటేకర్ మరణవార్తతో హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. తన విలక్షణమైన నటన, శక్తివంతమైన సంభాషణలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు.

రంగస్థలం నుంచి వెండితెరకు..
1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్‌లో జన్మించిన నానా పటేకర్‌ ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో విద్యాభ్యాసం చేశారు. నటనపై ఆసక్తితో రంగస్థలంపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1978లో వచ్చిన ‘గమన్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూనే తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. 1988లో వచ్చిన ‘సలామ్ బాంబే!’ ఆయన కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘పరిందా’ సినిమాలో పోషించిన పాత్ర నానా పటేకర్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు.



 ‘క్రాంతివీర్’తో మరో స్థాయికి..
నానా పటేకర్ కెరీర్‌లో ‘క్రాంతివీర్’ అత్యంత కీలకమైన చిత్రాల్లో ఒకటి.(తెలుగులో మోహన్‌బాబు నటించిన పుణ్యభూమి నా దేశం) ఇందులో ఆయన పోషించిన పాత్ర, చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఆయనకు మరింత భారీ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. ‘అబ్ తక్ ఛప్పన్’లో పోలీస్ అధికారిగా చేసిన పాత్ర కూడా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. తీవ్రమైన పాత్రలను మాత్రమే కాకుండా కామెడీ, కుటుంబ కథా చిత్రాల్లోనూ తన మార్క్ చూపించారు. ‘వెల్‌కమ్’ సినిమాలో ఉదయ్ భాయ్‌గా ఆయన చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఈ పాత్ర నానా పటేకర్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘ప్రహార్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’, ‘నటసమ్రాట్’ వంటి సినిమాలు ఆయన సినీ ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలిచాయి.

నటుడిగానే కాదు.. దర్శకుడిగానూ
నానా పటేకర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ సినిమాతో దర్శకుడిగా కూడా తన సత్తా చూపించారు.  దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నానా పటేకర్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.

 నానా పటేకర్‌ చివరిగా 2024లో వచ్చిన ‘వన్వాస్‌’లో కీలక పాత్ర పోషించారు. ఇలా రంగస్థలం నుంచి మొదలై ఆయన ప్రయాణం.. బాలీవుడ్‌లో అగ్ర నటుడిగా ఎదిగే వరకు సాగింది. శక్తివంతమైన సంభాషణలు, సహజమైన నటన, పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు ఆయన మరణంతో భారతీయ సినిమా ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది.

👉 :​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)