Breaking News

బలగం వేణు ఎల్లమ్మ మూవీ.. దేవీశ్రీతో సుదీర్ఘ చర్చ.!

Published on Tue, 01/20/2026 - 17:50

బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తన రెండో సినిమా టైటిల్‌ను ప్రకటించిన వేణు.. హీరోను కూడా పరిచయం చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా టాలీవుడ్ సినీ ప్రియులను  విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు డీఎస్పీ హీరోగా అరంగేట్రం చేయనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో వేణు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు హీరోగా మొదటి సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై ఏకంగా 8 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.

తాజాగా డైరెక్టర్ వేణు యెల్దండి తన ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డీఎస్పీతో ఫస్ట్ మీటింగ్‌.. ఇది 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అంటూ పోస్ట్ చేశారు. ఎల్లమ్మ కథపై వీరిద్దరి మధ్య ఏకంగా 8 గంటల పాటు చర్చ సాగిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమాపై వీరిద్దరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రంలో డీఎస్పీ పర్శీ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తన సినిమాకు డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు. 
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)