Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Published on Wed, 02/19/2025 - 17:40

తెలుగు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ హీరోగా నటించిన థ్రిల్లర్‌ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్‌ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది.

తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్‌ హోమ్స్‌ అన్న టైటిల్‌ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్‌ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్‌, హీరో పేరు ఓం ప్రకాశ్‌. ఈ మూడు పేర్లలో ఫస్ట్‌ లెటర్‌ సౌండింగ్‌ అన్నీ కలిపి షెర్లాక్‌ హోమ్స్‌ అని పెట్టారు.

(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)

కథేంటంటే?
రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఐ భాస్కర్‌ (అనీష్‌ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్‌ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్‌ డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌ (వెన్నెల కిషోర్‌)కి అప్పగిస్తాడు. 

ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి పట్నాయక్‌(బాహుబలి ప్రభాకర్‌)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్‌ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!

చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్‌ నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)