Breaking News

ఇప్పుడు అంతా బోనస్‌: ‘వెన్నెల’ కిశోర్‌

Published on Sun, 05/11/2025 - 01:18

‘‘నా కెరీర్‌లో కామెడీపాత్రలు చాలా చేశాను. వీటిలో నా ఫేవరెట్‌ రోల్స్‌ చాలానే ఉన్నాయి. కానీ ‘వెన్నెల, బిందాస్, దూకుడు’ సినిమాల్లో చేసినపాత్రలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నాకు డ్రీమ్‌ రోల్స్‌ అంటూ ఏవీ లేవు. ‘దూకుడు’ సినిమాలో నేను చేసిన రోల్‌ (ఎమ్‌ఎస్‌. రామానుజమ్‌ శాస్త్రి)తోనే నా డ్రీమ్‌ నెరవేరిపోయింది. ఇప్పుడు అంతా బోనస్‌’’ అన్నారు ‘వెన్నెల’ కిశోర్‌. శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగిల్‌’లో ‘వెన్నెల’ కిశోర్‌ ఓ కీలకపాత్ర చేశారు. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న (శుక్రవారం) విడుదలైంది. 

ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో ‘వెన్నెల’ కిశోర్‌ మాట్లాడుతూ – ‘‘సింగిల్‌’లో నేను చేసిన అరవింద్‌పాత్రకు మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సినిమాలను నేనెక్కువగా థియేటర్స్‌లో చూసుకోను. కానీ ఈ సినిమాను థియేటర్స్‌లో చూశాను. నాపాత్రను ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్న తీరు నాకు సంతోషాన్నిచ్చింది. నేను ఏపాత్ర చేసినా ఆపాత్ర వల్ల సినిమా కథ ముందుకెళితే చాలు.

ప్రస్తుతం రచయితలకు సరైన గౌరవం,పారితోషికం లభించడం లేదు. అందుకే వాళ్లు డైరెక్టర్స్‌ అయిపోతున్నారు. ఇక హీరోగా ఒకట్రెండు సినిమాలు చేశాను. కానీ ఎక్కువగా లవ్‌స్టోరీ సినిమాలు వస్తున్నాయి. రొమాన్స్, సాంగ్స్‌ నాకు నప్పవు. అలాగే నాపాత్ర చనిపోయే కథలు కూడా వచ్చాయి. కానీ అలాంటిపాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మంచి కామెడీ కథ కుదిరితే హీరోగా చేస్తా. ‘జఫ్ఫా’ సినిమాతో దర్శకుడిగా ఫెయిల్‌ అయ్యాను. భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తాను. థ్రిల్లర్‌ మూవీస్‌ చేయాలని ఉంది’’ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)