Breaking News

'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!

Published on Tue, 01/21/2025 - 21:08

వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.

ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్‌ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..

గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్‌ (రూ.9.54 కోట్ల షేర్‌) సాధించిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది.  విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh Daggubati) కెరీర్‌లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్‌ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్‌ చేస్తామని తెలిపాడు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)