Breaking News

ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్‌ ట్విస్ట్!

Published on Sat, 03/01/2025 - 20:03

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.  అయితే ఓటీటీ వర్షన్‌లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అయితే థియేటర్‌ వర్షన్‌ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్‌ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్‌ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ‍అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)