Breaking News

ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు

Published on Sun, 03/02/2025 - 16:30

ఈ ఏడాది పొంగల్‌కు రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) ఓ రేంజ్‌లో అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ తగ్గేదేలే అన్నట్లుగా థియేటర్లకు క్యూ కట్టారు. కడుపుబ్బా నవ్వుకుని ఎన్నాళ్లవుతుందో అన్నట్లుగా సినీప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు సినిమా చూసి ఎంజాయ్‌ చేశారు. పోటీలో గేమ్‌ ఛేంజర్‌, డాకు మహారాజ్‌ సినిమాలున్నా వాటిని వెనక్కు నెట్టి విజేతగా నిలిచింది.

ఓటీటీలో ప్రభంజనం
విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh Daggubati) హీరోగా ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 1న అటు టీవీలో, ఇటు ఓటీటీలో రిలీజైంది. ఇంకేముంది, వన్స్‌ మోర్‌ అంటూ ఆడియన్స్‌ టీవీలకు అతుక్కుపోయారు. ఓటీటీ ‍ప్రియులు జీ5లో సినిమా తెగ చూసేస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్‌ వచ్చాయని జీ5 అధికారికంగా ప్రకటించింది. 13 లక్షలమంది సినిమా వీక్షించారని పేర్కొంది. ఇంతకుముందు ఆర్‌ఆర్‌ఆర్‌, హనుమాన్‌ సినిమాల రికార్డులను సంక్రాంతికి వస్తున్నాం బద్ధలు కొట్టిందని వెల్లడించింది. జీ5 ప్లాట్‌ఫామ్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ అని పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. వెంకీమామ భార్య భాగ్యంగా ఐశ్వర్య, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ కొడుకు బుల్లిరాజుగా రేవంత్‌ భీమల అదరగొట్టారు. కొరికేత్త నిన్ను అంటూ బుల్లిరాజు చేసే కామెడీ కోసమైనా సినిమా చూడాల్సిందే అంటున్నారు. అన్నట్లు ఈ మూవీ ఓటీటీలో తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

 

 

చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్‌ రెడ్డి వంగా

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)