Breaking News

సంక్రాంతికి పండగే పండగ

Published on Mon, 01/08/2024 - 01:43

‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్‌’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్‌ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్  సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను  ఆదరించిన మీరు ‘సైంధవ్‌’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్‌ అన్నారు.

శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్  సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ‘సైంధవ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్‌ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్‌’ కోసం వచ్చాను.

న్యూ ఏజ్‌ యాక్షన్  అండ్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్‌ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్‌’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌.

ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్‌హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్‌గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్‌ హీరోలు రియలిస్టిక్‌ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్‌’’ అన్నారు శైలేష్‌ కొలను.

‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని చూశాను. ‘సైంధవ్‌’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్‌’’ అన్నారు వెంకట్‌ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్  సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్  మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్‌ గ్యారీ తదితరులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)