జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
'వెంకటేశ్' రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన సుస్మిత
Published on Thu, 01/22/2026 - 10:14
చిరంజీవి- వెంకటేశ్ కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. తాజాగా ఈ మూవీ రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి రేసులో భారీ విజయం అందుకున్న ఈ మూవీలో వెంకటేశ్ పాత్ర చాలా కీలకంగానే ఉంటుంది. దీంతో ఆయన రెమ్యునరేషన్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ కమ్రంలోనే నిర్మాత సుస్మిత కొణిదెల ఒక క్లారిటీ ఇచ్చారు.
మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం వెంకటేష్ రెమ్యునరేషన్ రూ. 10 కోట్లు పైమాటేనని చాలా కథనాలు వచ్చాయి. అదేం కాదు చిరు మీద ప్రేమతో తను చాలా తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు మరికొందరు తెలిపారు. దీనిపై సుస్మిత అసలు విషయం చెప్పారు. అయితే, ఆమె కూడా తెలివిగా నంబర్స్ రూపంలో వెంకీ రెమ్యునరేషన్ గురించి చెప్పలేదు. కానీ, వెంకటేశ్ గారు తమ ఫ్యామిలీ మెంబర్ లాంటి వ్యక్తి అని సుస్మిత చెప్పారు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తమ మధ్య డిబేట్ ఏం జరగలేదన్నారు.
ఆయనకు ఎంత ఇవ్వాలన్నా తమకు ఆనందమేనని చెప్పారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం చాలా విలువైనదని ఆమె గుర్తుచేసుకున్నారు. స్క్రీన్‌పై వెంకీ గారు కనిపించిన దగ్గర నుంచి ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అయ్యారని తెలిపారు. అందుకే ఆయన ఆడిగిన రెమ్యునరేషన్ ఇచ్చామని సుస్మిత చెప్పారు. డబ్బు కోసం కాకుండా.. కేవలం తన అభిమానులతో పాటు మూవీ ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసం వెంకీ నటించారని తెలుస్తోంది.
Tags : 1