Breaking News

ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత

Published on Fri, 07/18/2025 - 12:37

తమిళ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్‌ (68) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నటుడి మృతిపై పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వేలు ప్రభాకరన్‌.. 1980లో వచ్చిన `ఇవర్గళ్ విత్యసామానవర్గళ్‌` చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. `నాలయ మనిదన్` మూవీతో దర్శకుడిగా మారారు.

దర్శకుడిగా, నటుడిగా..
ఈ చిత్రం సక్సెస్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా `అతిశయ మనిదన్` మూవీ తెరకెక్కించారు. తన సినిమాల్లో సున్నితమైన విషయాలను నిస్సందేహంగా చర్చించేవారు. అలా అసురన్‌, రాజాలి, కడవుళ్‌, పురాచ్చిక్కారన్‌, కాదల్‌ కాదై, ఒరు ఇయక్కునరిన్‌ కాదల్‌ డైరీ వంటి సినిమాలు డైరెక్ట్‌ చేశారు. వేలు ప్రభాకరన్‌ (Velu Prabhakaran) దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించారు. 

పదినారు, గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, కడవర్, పిజ్జా 3, రైడ్, వెపన్ చిత్రాల్లో నటించారు. చివరగా ఈ ఏడాది రిలీజైన గజన మూవీలో కనిపించారు. వేలు గతంలో దర్శకనటి పి.జయాదేవిని పెళ్లి చేసుకున్నారు. కాదల్‌ కాదై సినిమాలో తనతో కలిసి నటించిన షిర్లే దాస్‌ను 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: Junior Review: ‘జూనియర్‌’ మూవీ రివ్యూ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)