Breaking News

తెలుగులో కన్నడ బ్లాక్‌ బస్టర్‌ ‘వీర చంద్రహాస’

Published on Sun, 04/20/2025 - 19:38

‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్, ఇప్పుడు ‘వీర చంద్రహాస’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై ఘన విజయం సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేసిన రాధాకృష్ణ, ఇప్పుడు ‘వీర చంద్రహాస’ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, “‘వీర చంద్రహాస’ కన్నడలో హిట్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందని గట్టి నమ్మకం ఉంది. రవి బస్రూర్ సంగీతంతో అలరించడమే కాక, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించడం సంతోషకరం” అని తెలిపారు.

‘వీర చంద్రహాస’ మహాభారతంలోని అశ్వమేధిక పర్వం ఆధారంగా రూపొందిన కథ. ఒక అనాథ బాలుడు పరాక్రమవంతుడై, సద్గుణవంతుడై వీర చంద్రహాసుడిగా ఎదిగే గాథను చిత్రిస్తుంది. సినిమా చరిత్రలో తొలిసారిగా యక్షగానం వెండితెరపై వైభవంగా ఆవిష్కృతమై, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)