Breaking News

నెల రోజుల్లోపే ఓటీటీకి మెగా హీరో యాక్షన్‌ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Sun, 03/17/2024 - 16:34

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన  బిగ్గెస్ట్  ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ . శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించగా.. నవదీప్‌ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ రూపొందించారు.

ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా కనిపించారు. హీరోయిన్‌ మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో మెప్పించారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  అతిపెద్ద వైమానిక దాడిని ఈ చిత్రంలో చూపించారు.ఈ సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ థియేటర్లలో విడుదలైంది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులన అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. ఈ ఫర్‌ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే తేదీ ఫిక్స్ అయితే ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో చూసేయొచ్చు. కాగా..  ఈ చిత్రంలో నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)