Breaking News

కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్

Published on Thu, 10/02/2025 - 13:51

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గత నెల 10న వీళ్లకు మగ పిల్లాడు పుట్టాడు. రీసెంట్‌గానే మూడు నాలుగు రోజుల క్రితం బారశాల వేడుక జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. కాకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు.

(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)

ఇప్పుడు స్వయంగా వరుణ్-లావణ్య దంపతులు తమ కొడుకు పరిచయం చేస్తూ పేరుని బయటపెట్టారు. హనుమంతుడి  పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు రెండు ఫొటోల్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ లైకులు కొట్టేస్తున్నారు.

నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు.

(ఇదీ చదవండి: కాంతార 1 టీమ్‌పై 'ఎన్టీఆర్' కామెంట్స్‌)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)