Breaking News

గాండీవధారి అర్జున ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఫిక్స్‌.. ఆ పండగకు!

Published on Sat, 08/26/2023 - 11:29

ఈ మధ్య మెగా హీరోలకు ఏదీ కలిసి రావడం లేదు. చిరంజీవి భోళా శంకర్‌, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడ్డాయి. తాజాగా ఇదే బాటలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. వరుణ్‌ తేజ్‌ గాండీవధారి అర్జున. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. సాధారణ వసూళ్లు రాబట్టడం కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో ఈ సినిమా సైతం అట్టర్‌ ఫ్లాప్‌ దిశగా అడుగులు వేస్తోంది. 

అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. యాక్షన్‌ సీన్స్‌, తల్లి సెంటిమెంట్‌ బాగున్నాయంటున్నారు. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సినిమాను నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. అయితే థియేటర్ల వద్ద పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఈ  వినాయక చవితి (సెప్టెంబర్‌ 19న)కి ఓటీటీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. 

వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన గాండీవధారి అర్జున సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా మెప్పించింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌, రోషిణి, అభినవ్‌ గోమతం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మిక్కీజే మేయర్‌ సంగీతం అందించాడు.

చదవండి: సిగరెట్‌, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)