Breaking News

వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published on Fri, 01/31/2025 - 21:33

టైటిల్: రాచరికం

నటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులు

డైరెక్టర్: సురేష్ లంకలపల్లి

నిర్మాత: ఈశ్వర్

నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌

ఎడిటర్: జేపీ

సినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణ

సంగీతం: వెంగీ

విడుదల తేదీ: 31 జనవరి 2025

వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో బజ్‌ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.

రాచరికం కథేంటంటే..? 

1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా తీశారంటే..

దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్  కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.

ఎవరెలా చేశారంటే..

నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్‌ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్‌లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్‌తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్‌గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్‌ఎస్‌ఎఫ్ లీడర్‌గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్‌,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)