Breaking News

'పదేళ్లలో ఏం మారలేదు.. ఆ ఒక్కటి తప్ప..'.. వితికా శేరు-వరుణ్ సందేశ్ స్పెషల్ పోస్ట్

Published on Sun, 12/07/2025 - 14:45

టాలీవుడ్ ప్రముఖ జంటల్లో వితికా శేరు- వరుణ్ సందేశ్ ఒకరు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు చేరుకుంది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 19, 2016న వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ ఏడాది కొత్తింట్లో అడుగుపెట్టిన ఈ జంట సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

తాజాగా ఈ జంట తమ ఎంగేజ్‌మెంట్‌ రోజులను గుర్తు చేసుకుంది. నిశ్చితార్థం జరిగి సరిగ్గా నేటికి పదేళ్లు పూర్తయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పదేళ్ల మా ప్రేమలో అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు రాలేదని.. కేవలం మా వయస్సు సంఖ్య మాత్రమే పెరిగిందని పోస్ట్ చేశారు. మాకెలాంటి తొందర, గడువులు లేవు.. ఇప్పుడిప్పుడే మేమిద్దరం జీవితం గురించి నేర్చుకుంటున్నామని తెలిపారు. దశల వారీగా జీవితాన్ని నిర్మించుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వితికా శేరు- వరుణ్ సందేశ్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీరిద్దరు ఇలాగే నూరేళ్లు సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. ఈ ఏడాది వరుణ్ సందేశ్‌కు ఆయన సతీమణి వితికా శేరు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.  వరుణ్ సందేశ్‌ పుట్టిన రోజున మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త వరుణ్ బర్త్‌డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భార్యతో కలిసి బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. 


 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)