Breaking News

భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టుతో కూలీ నెం. 1

Published on Sun, 11/21/2021 - 16:28

Varun Dhawan Met With Indian Women's Football Team: భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టును కలిసి బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కలిశాడు. నాలుగు దేశాల(ఇండియా, బ్రెజిల్‌, చిలీ, వెనిజులా)తో ఆడనున్నటోర్నమెంట్‌లో శనివారం బ్రెజిల్‌లోని మనాస్‌కు వెళ్తుండగా విమానాశ్రయంలో వరుణ్‌ ధావన్‌ తారసపడ్డాడు. ఈ సందర్భంగా మహిళల ఫుట్‌బాల్‌ టీం, వరుణ్‌ ధావన్‌ కలిసి కెమెరాను క్లిక్‌మనిపించారు. ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చారు.  ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ ర్యాంక్‌లో ఉన్న భారత మహిళ జట్టు, నవంబర్‌ 25న ఏడో ర్యాంక్‌లో ఉ‍న్న బ్రెజిల్‌తో, నవంబర్‌ 28న చిలీ (37వ ర్యాంక్‌), డిసెంబర్‌ 1న వెనిజులా (56వ ర్యాంకు)తో తలపడనుంది.  

ఇప్పటికే బ్రెజిల్‌కు కాన్ఫెడెరాకో బ్రెజిలీరా డి డిస్పోర్టోస్‌ (CBF) పేరుతో పూర్తి జట్టుగా మారింది. ఇందులో మార్టా డా సిల్వా, ఫార్మిగా మోటా వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. జనవరి 2022 నుంచి ముంబై, పూణెలలో జరిగే ఆసియా కప్‌ కోసం భారత జట్టు ప్రాక్టీస్‌లో భాగంగా ఎక్స్‌పోజర్‌ టూర్‌ ఉంది. ఇదిలా ఉంటే, తన రాబోయే చిత్రం ఫ్యామిలీ డ్రామా అయిన 'జగ్‌ జగ్‌ జీయో' విడుదల తేదిని శనివారం వరుణ్‌ ప్రకటించాడు. వరుణ్‌ ధావన్‌, కియారా అద్వాని, నీతూ కపూర్‌, అనిల్‌ కపూర్‌, మనీష్‌ పాల్‌, ప్రజక్తా కోలీ నటిస్తున్న ఈ చిత్రం జూన్‌ 24, 2022న థియేటర్లలోకి రానుంది. 

చదవండి: వరుణ్‌ ధావన్‌ షాకింగ్‌ లుక్‌, అనిల్‌ కపూర్‌ స్పందన!

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)