Breaking News

వారణాసి, పెద్ది, ప్యారడైస్‌.. ఏ సినిమా షూట్‌ ఎక్కడ జరుగుతుంది?

Published on Wed, 02/18/2026 - 18:01

టాలీవుడ్‌లో  షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.

📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్  సోమవారం వరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్‌ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుంది.

📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.

📽️ ఎన్టీఆర్ - డ్రాగన్‌: తారక్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.

📽️ అల్లు అర్జున్ - AA22:  అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.

📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్‌లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.

📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్‌హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.

📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో జరుగుతోంది.

📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.

📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.

📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)