'దేవర' సెట్స్‌లో మహేశ్ 'వారణాసి'.. ఎందుకంటే?

Published on Wed, 04/15/2026 - 12:12

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'వారణాసి'. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఉగాదికి థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రతినాయకుడు పృథ్వీరాజ్‌కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం మహేశ్ బాబుతో నీటి అడుగున కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం 'దేవర' సెట్స్‌ ఉపయోగించుకుంటున్నారట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)

లెక్క ప్రకారం 'వారణాసి' మూవీకి సంబంధించి అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం విదేశాలకు వెళ్లాలని మూవీ టీమ్ ప్లాన్ చేసుకుంది. కానీ యుద్ధ పరిస్థితుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్లాన్ మార్చుకున్న 'వారణాసి' టీమ్.. హైదరాబాద్‌లో 'దేవర' కోసం తయారు చేసిన వాటర్ సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నారట. ఇకపోతే రెండు మూడు రోజుల క్రితమే పడవలో ఫైట్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. వీటిపై చిత్రబృందం అప్రమత్తమైంది.

టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో గ్లోబల్ అడ్వెంచర్‌గా 'వారణాసి' సినిమాని తీస్తున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీ థీమ్ ఏంటో చెబుతూ గతంలో విడుదల చేసిన మూడు నిమిషాల వీడియో ఆకట్టుకోగా.. త్వరలోనే కొత్త పాటని రిలీజ్ చేసే అవకాశముంది.

(ఇదీ చదవండి: అంతా రెండో భాగంలోనే.. 'రామాయణ'పై యష్ కామెంట్స్)

Videos

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ పై పొన్నవోలు సంచలన రియాక్షన్

నెల్లూరు తీరంలో దేవర... జువ్వలదిన్నె మత్స్యకారులకు భరోసా

పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.

Photos

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)

+5

బ్లాక్ శారీలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెహ్రూ జూ పార్కులోని మూగజీవులకు వేసవి తాపం (ఫొటోలు)