Breaking News

వారణాసి.. ఏదో ఒకటి తేల్చాల్సిందే

Published on Wed, 11/18/2026 - 16:59

రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా చెప్పిన తేదీకి అయితే రిలీజ్ కాదు. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. ఆయన అభిమానులే స్వయంగా ఈ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు మహేశ్ 'వారణాసి' విషయంలోనూ అలాంటివే వినిపిస్తున్నాయి. కానీ మూవీ టీమ్, తేదీ గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ 'వారణాసి' విషయంలో అసలేం జరుగుతోంది?

(ఇదీ చదవండి: బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు శిక్ష వేసిన కోర్ట్)

'వారణాసి' అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే కొన్ని థియేటర్లలో గ్లింప్స్‌ని ప్లే చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న 'వారణాసి' అఫీషియల్ ట్విటర్  హ్యాండిల్ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. 'షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అవుతోంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ స్టార్ట్ చేయాలి. ఇది అప్‌డేట్ అనుకుంటే ఇదే అది. కానీ బ్లాస్‌ కోసం ఇంకొన్నిరోజులు ఎదురుచూడాలి' అని ఓ నెటిజన్‌కి బదులిచ్చారు.

అసలు విషయానికొస్తే ఏప్రిల్ 07న 'వారణాసి' రిలీజ్ కావట్లేదని.. బదులుగా 'మగధీర' వచ్చిన జూలై 31 లేదా మహేశ్ పుట్టినరోజైన ఆగస్టు 09న విడుదల తేదీ ఆప్షన్ చూస్తున్నారని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యమయ్యేలా ఉండటమే దీనికి కారణాలు అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

అయితే ఈ రూమర్స్ నిజమా కాదా అనేది దర్శకుడు రాజమౌళి ఏదో ఒకటి తేల్చేవరకు వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ వాయిదా పడింది అంటే చెప్పేస్తే అందుకు తగ్గట్లు అభిమానులు ప్రిపేర్ అవుతారు. ఆ తేదీకి రావట్లేదంటే వేరే ఏ పెద్ద సినిమాలైనా ఆ డేట్‌కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటాయి. మరి నెట్టింట వినిపిస్తున్న రూమర్స్‌ని రాజమౌళి అండ్ టీమ్ అబద్ధమని తేలుస్తారా? లేదంటే వాయిదా వేస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు కామెడీ సినిమా)

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)