Breaking News

ఆరంభం... ముగింపు అక్కడే!

Published on Mon, 05/04/2026 - 01:37

‘‘వారణాసి’ చిత్రకథ వారణాసి ఘాట్‌లలో ఆరంభమై, అక్కడే ముగుస్తుంది’’ అని పేర్కొన్నారు ఎస్‌ఎస్‌ కార్తికేయ. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ‘కామిక్‌ కాన్‌ ఎక్స్‌పీరియన్స్‌’లో ఈ చిత్రం వీడియో గ్లింప్స్‌ని ప్రదర్శించారు. ఆ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ... ఈ సినిమా వారణాసి ఘాట్స్‌లో ఆరంభమై, అక్కడే ముగుస్తుందని పేర్కొన్నారు.

ఇంకా దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణం ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంటుందని తెలిపారు కార్తికేయ. ఒక కొత్త కోణంలో రాజమౌళి చిత్రీకరించిన ఈ ఎపిసోడ్‌ మొత్తం ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని విధంగా ఉంటుందని, విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉంటుందని కూడా పంచుకున్నారు. తెరపై కనిపించే ఈ 20 నిమిషాల ఎపిసోడ్‌ చిత్రీకరణకు దాదాపు 60 రోజులు పట్టిందట. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ అంటార్కిటికాలో జరుగుతోంది. 2027 ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ విడుదల కానుంది.

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)