Breaking News

పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?. వరలక్ష్మి క్లారిటీ మామూలుగా లేదుగా!

Published on Sun, 01/14/2024 - 16:52

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న నటి క్రేజీ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం అంజమ్మ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్‌  చిత్రాల్లో కనిపించిన బెంగళూరు బ్యూటీ కొత్త ఏడాదిలో హనుమాన్‌ చిత్రం ద్వారా పలకరించింది. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న భామ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పెళ్లి చేసుకునే విషయంపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చింది. 

వివాహం గురించి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 'పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మన లైఫ్‌లో అది ఒక పార్ట్‌. అంతే కానీ అది గోల్ కాదు. నేను వివాహానికి వ్యతిరేకం కాదు. ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడటం 18 ఏళ్ల క్రితమే అపేశారు. నా దృష్టిలో పెళ్లి అనేది ముఖ్యం కాదు. మ్యారేజ్ చేసుకున్నా ఓకే.. చేసుకోపోయినా ఓకే. చాలామంది పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నారు. నా బెస్ట్‌ఫ్రెండ్‌ త్రిష కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు.' అని అన్నారు. దీంతో పెళ్లి అనేది జీవితంలో కేవలం ఒక పార్ట్‌ మాత్రమేనని తనదైన శైలిలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. కానీ పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)