ఆయనలా దిగజారను.. సాయిమాధవ్‌కు వరలక్ష్మి కౌంటర్‌

Published on Sat, 03/07/2026 - 13:44

వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వీయదర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సరస్వతి. సాయిమాధవ్‌ బుర్ర కథ అందించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఇష్టమొచ్చినట్లు మార్చేశారని సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు సాయిమాధవ్‌. సరస్వతి సినిమా పేరు ప్రస్తావించకుండా ఓ పోస్ట్‌ పెట్టాడు. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. 

హర్టయిన సాయి మాధవ్‌
ఒక్కమాటైనా చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. కథను మానభంగం చేశారు. నాది రివేంజ్‌ డ్రామా కాదు, నా సోల్‌ వేరు, అసలా కథే వేరు అని పేర్కొన్నాడు. ఈ వివాదంపై తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్‌‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరి కథను దొంగతనం చేయలేదు. కాంట్రాక్ట్‌ వేసి డబ్బులు ఇచ్చాకే ఆ కథ (సరస్వతి) నాదయింది. ఆయనపై గౌరవంతో క్రెడిట్స్‌లో తన పేరును పొందుపరిచాం. 

అందుకే మార్చాం
కానీ, ఆయన ఆ గౌరవాన్ని మిగుల్చుకోలేదు. ఒకవేళ నా పేరు పెట్టుంటే ఇంకా సంతోషపడేదాన్ని. నాకే సమస్య లేదు! అసలేమైందంటే.. ఆయన చెప్పిన కథ విన్న ప్రతివాళ్లు సాగదీసినట్లుగా ఉందన్నారు. పెద్ద స్టార్స్‌ ఉన్నప్పుడు ఆ కథను యథాతథంగా ముందుకు తీసుకువెళ్లగలమేమో! కానీ మేము మంచి నటులం తప్ప పెద్ద స్టార్స్‌ కాదు! కాబట్టి ఆ కథను జనంలోకి ఎలా తీసుకెళ్లాలి? అని ఆలోచించాం.

కథ డెవలప్‌ చేసుకున్నా..
దానిపై చాలా వర్క్‌ చేశాం. ఆ సమయంలో ఆయన ఒక్కసారి కూడా స్టోరీ సిట్టింగ్‌కు రాలేదు. తను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. సరేలే, బిజీగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. నేనే కథను డెవలప్‌ చేసుకున్నాను. కనీసం ఫోన్‌లో అందుబాటులోకి వచ్చినా కథ మార్చామని చెప్పగలిగేవాళ్లం. అప్పుడేమో ఆయనే అలా చేసి ఇప్పుడలాంటి కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. 

దిగజారను
అందులోనూ కథను మానభంగం చేశారని పెద్ద పెద్ద వ్యాఖ్యలు మీలాంటి వ్యక్తి నోటి నుంచి రాకూడదు. ఇది సభ్యత అనిపించుకోదు. సెన్సిటివ్‌ టాపిక్‌పై ఎలాంటి పదాలు వాడుతున్నామనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నాకు కావాలంటే చాలా కథలు బయటకు తీసేదాన్ని, కానీ నేనలాంటి మనిషిని కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను, మర్యాదిస్తాను. ఆయనలా దిగజారి నేను మాట్లాడను వరలక్ష్మి కౌంటర్‌ ఇచ్చింది.

చదవండి: సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్‌

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)