Breaking News

చనిపోయింది నా మూడో భర్త కాదు, నేను సంతోషంగా ఉన్నా: వనిత

Published on Wed, 05/03/2023 - 13:24

నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి నటి వనితా విజయ్‌ కుమార్‌. తండ్రితో ఆస్తి గొడవలు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, పెళ్లిళ్లు,-విడాకులు.. ఇలా ఏదో ఒక విధంగా తమిళనాట వార్తల్లో వనిత పేరు తరచూ వినిపిస్తుంది. వనితతో గతంలో రిలేషన్‌షిప్‌ మెయింటెన్‌ చేసిన పీటర్‌ పాల్‌ ఇటీవల కన్నుమూశాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. 

తాజాగా దీనిపై వనిత స్పందించింది. పీటర్‌తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని కుండబద్ధలు కొట్టింది. 'పీటర్‌ పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. కాకపోతే 2020లో మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అదే ఏడాది విడిపోయాం కూడా! అతడు నా భర్త కాదు, నేను అతడికి భార్యను కాదు. నేనసలు వైవాహిక జీవితంలోనే లేను. ఏ విషయానికీ నేను బాధపడటం లేదు. సింగిల్‌గా జీవిస్తున్నా. సంతోషంగా బతుకుతున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. కాగా లాక్‌డౌన్‌లో వనిత, పీటర్‌ల పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. అయితే తనకు విడాకులివ్వకుండా పీటర్‌ మరో పెళ్లి చేసుకున్నట్లు అతడి మొదటి భార్య ఎలిజబెత్‌ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వనిత- పీటర్‌ల పెళ్లి చెల్లదని పేర్కొంది. కానీ కొంతకాలానికే వారు విడిపోయారు. 

ఆతర్వాత సింగిల్‌గా ఉన్న వనిత ఓసారి తమిళ పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనిపై స్పందించిన వనిత.. ఇది కేవలం పికప్‌ డ్రాప్‌ సినిమాకు సంబంధించిన ఫోటో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినా ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని మహిళ చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. నేను నాలుగు కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడేమో తనకసలు మూడో పెళ్లే జరగలేదని మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

చదవండి: స్టార్‌ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)