Breaking News

రాజకీయాలపై ఇంట్రస్ట్‌ చూపిస్తున్న బ్యూటీ..

Published on Thu, 02/15/2024 - 12:05

బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్‌ అయిన నటీమణుల్లో వాణి భోజన్‌ ఒకరు. ఆకర్షణీయమైన అందం, అలరించే అభినయం ఉన్న ఈమె ఓ మై కడవులే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే నటిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత లాకప్‌, రామే ఆండాలుమ్‌ రావణనే ఆండాళుమ్‌, పాయుమ్‌ అని నీ వెనక్కు చిత్రాలతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళ్‌ రాకర్స్‌ వంటి వెబ్‌ సీరీస్‌లోనూ నటించారు.

ప్రస్తుతం ఆర్యన్‌, క్యాసినో, పగైవనుక్కూ అరుళ్‌ వాయ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందాల ఆరబోతల్లో ముందుండే వాణి భోజన్‌ రాజకీయాలపై తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇటీవల హీరో విజయ్‌ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాణిభోజన్‌ తన ఎక్స్‌ మీడియాలో నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు.

దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్‌ చాలాకాలంగా తన అభిమాన సంఘాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. సెంగళం అనే వెబ్‌సీరీస్‌లో తాను రాజకీయ నాయకురాలి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే తనకు రాజకీయాలపై ఆసక్తి కలిగిందన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు వాణి భోజన్‌.

చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్‌ పవిత్ర

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)