ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి : వంశీ నందిపాటి

Published on Sun, 02/15/2026 - 08:37

‘‘హే భగవాన్‌’ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ. స్టోరీ లెవల్‌ నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ఇప్పుడు సమర్పకుడిగా ఉన్నాను. ఈ సినిమాలో బిజినెస్‌ అనే అంశం ఉంటుంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది’’ అని వంశీ నందిపాటి అన్నారు. 

సుహాస్, శివానీ నాగారం జోడీగా గోపీ అచ్చర దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్‌’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు భగవాన్‌.. అందుకే ‘హే భగవాన్‌’ టైటిల్‌ పెట్టాం. కొంతకాలం నుంచి సుహాస్‌ ఎదురు చూస్తున్న కమర్షియల్‌ సక్సెస్‌ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. కథ పరంగా ఏవైనా మార్పులుంటే కన్విన్సింగ్‌గా చెబితే దర్శకులు కూడా ఒప్పుకుంటారు. అయితే కంటెంట్‌లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.

దర్శకుడు హ్యాపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. ఇక ‘లిటిల్‌ హార్ట్స్, రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీస్‌ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్‌ రిజిస్టర్‌ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం. బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. 

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌గా మార్చి 6న రిలీజ్‌ చేస్తున్నాను. సత్యదేవ్‌తో పాటు శ్రీవిష్ణుతో సినిమాలు చేస్తున్నాను. ‘పొలిమేర–3’ షూట్‌ని ఏప్రిల్‌ లేదా మేలో ప్రారంభిస్తాం. ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈటీవీ విన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను’’ అని చెప్పారు.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)