Breaking News

బద్రీనాథ్‌ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి

Published on Fri, 04/18/2025 - 10:58

ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. ఐటం సాంగ్స్‌తోనే కాదు ఆసక్తికర వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆ మధ్య బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడమంటే.. తన వేలికున్న డైమండ్‌ రింగ్‌ చూపిస్తూ షోఆఫ్‌ చేసింది. తన తీరుపై విమర్శలు రావడంతో సారీ చెప్పింది. తర్వాత రామ్‌చరణ్‌-కియారాల గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌ అవడం, తను ఐటం సాంగ్‌తో పాటు చిన్న పాత్ర చేసిన డాకు మహారాజ్‌ హిట్టవడంతో సంతోషం తట్టుకోలేకపోయింది. 

నేనే గొప్ప అన్నట్లుగా..
చూశారా? నా సినిమా సూపర్‌ హిట్టయింది. కియారా నటించిన గేమ్‌ ఛేంజర్‌ షెడ్డుకు వెళ్లిపోయింది. ఇందులో నా తప్పయితే లేదు సుమీ.. సినిమా బాగోలేకపోతే జాకీలు పెట్టి లేపినా జనాలు లెక్కచేయరు అని కామెంట్లు చేసింది. కొద్ది రోజుల క్రితం హీరో షారూఖ్‌ ఖాన్‌ తర్వాత సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ చేసేది నేనే.. హాలీవుడ్‌ వాళ్లు కూడా వారి సినిమా కోసం నన్నే ప్రమోషన్స్‌ చేయమన్నారు అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంది.

ఇక్కడో గుడి.. సౌత్‌లో కూడా ఉంటే..
ఇప్పుడేకంగా తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందే అని చెప్తోంది. తాజాగా ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారు. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారు. పనిలో పనిగా దక్షిణాదిన కూడా నాకో గుడి కడితే బాగుంటుంది అని పేర్కొంది. ఊర్వశి.. చివరగా సన్నీడియోల్‌ 'జాట్‌' సినిమాలో సారీ బోల్‌ పాటలో కనిపించింది.

చదవండి: ట్రిపుల్‌ ట్రీట్‌.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)