కియారా సినిమా డిజాస్టర్‌.. ఊర్వశి మూవీ బ్లాక్‌బస్టర్‌.. బ్యూటీ రియాక్షనిదే!

Published on Fri, 01/17/2025 - 17:49

ఎప్పుడొచ్చామన్నది కాదు హిట్టు కొట్టామా? లేదా? అన్నదే ముఖ్యం! ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో మొట్ట మొదట రిలీజైన మూవీ గేమ్‌ ఛేంజర్‌ (Game Changer Movie). రామ్‌చరణ్‌, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టినా మిక్స్‌డ్‌ టాక్‌ వల్ల రెండో రోజు నుంచి డీలా పడిపోయింది.

దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్‌
రెండు రోజుల గ్యాప్‌తో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్‌ మూవీ (Daaku Maharaaj Movie)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో కలెక్షన్లు జోరందుకున్నాయి. దబిడి దిబిడి పాటలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో బాలయ్య చేసిన స్టెప్పులపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. కానీ అవేవీ సినిమా విజయానికి అడ్డుగా నిలవలేదు.

సంక్రాంతి విన్నర్‌?
చివరగా జనవరి 14న విక్టరీ వెంకటేశ్‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam)తో వచ్చాడు. వస్తూనే పండగ మోసుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. మౌత్‌ టాక్‌తోనే ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించగలిగాడు. రూ.100 కోట్లు అందుకోవడానికి డాకు మహారాజ్‌కు నాలుగు రోజులు పడితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లో చేరింది.

(చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య)

అభిప్రాయాలు గౌరవిస్తా
ఇకపోతే దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సక్సెస్‌ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకోగలను. నందమూరి బాలకృష్ణతో చేసిన డ్యాన్స్‌ విషయానికి వస్తే.. మా పర్ఫామెన్స్‌ గురించి పలువురూ పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను.

అది ఒక కళ
ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డ్యాన్స్‌ అంటే కేవలం పర్ఫామెన్స్‌ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడంగా ఫీలవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. . మేము వేసిన ప్రతి స్టెప్‌ కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పని చేయడం వల్ల నా కల నిజమైనట్లుగా ఉంది అని చెప్పుకొచ్చింది.

నేనేం చేయలేదు
కియారా అద్వానీ గేమ్‌ ఛేంజర్‌ గురించి మాట్లాడుతూ.. మనం నటించిన సినిమా బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ మనకంటూ ఓ క్రేజ్‌ తీసుకొస్తాయి. ఉదాహరణకు.. 2025లో రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్‌ అవుట్‌సైడర్‌ నటిగా ఓ రికార్డు ఇచ్చారు. ఇది మనకు ఇండస్ట్రీ ఇచ్చే గుర్తింపు. దీనివల్ల మన యాక్టింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నేను కొన్ని ట్వీట్స్‌ చూశాను.. కియారా అద్వానీ సినిమా డిజాస్టర్‌ అయింది. కానీ ఊర్వశి సినిమా బ్లాక్‌బస్టర్‌ అని రాశారు. అందులో నా హస్తం ఏమాత్రం లేదు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.

 

 

చదవండి: సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్‌ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా?

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)