'గేమ్ ఛేంజ‌ర్' డిజాస్టర్‌గా మిగిలింది.. డాకు మ‌హారాజ్‌ బ్యూటీ కామెంట్స్‌

Published on Mon, 01/20/2025 - 08:57

బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) మరోసారి తన మాటలతో  వైరల్‌ అవుతుంది. కొద్దిరోజుల క్రితం సైఫ్‌ అలీ ఖాన్‌పై జరిగిన దాడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది. తాజాగా గేమ్‌ ఛేంజర్‌( Game Changer) సినిమా రిజల్ట్‌ గురించి ఊర్వశి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సంక్రాంతి రేసులో పోటీ పడిన చిత్రాల్లో గేమ్‌ ఛేంజ్‌ర్‌ కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఊర్వశి చేసిన కామెంట్లు చరణ్‌ అభిమానుల్లో కోపాన్ని తెప్పించేలా ఉన్నాయి.

డాకు మ‌హరాజ్‌(Daaku Maharaaj) సినిమాలో బాల‌కృష్ణతో స్టెప్పులేసిన ఊర్వశికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమె తాజాగా బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలో తన పాత్రకు మంచి మైలేజ్‌ వచ్చిందని ఇలా  మాట్లాడింది. 'బాలీవుడ్‌ హీరోయిన్‌  కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. కానీ, నేను న‌టించిన డాకు మ‌హ‌రాజ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇందులో నా త‌ప్పు  అయితే లేదు. సినిమా బాగా లేకున్నప్పటికీ పెయిడ్ పీఆర్‌లు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నా  జ‌నాలు తిప్పికోడ‌తారు.' అని ఊర్వశి చెప్పుకోచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

(ఇదీ చదవండి: అదివారం నాడు ఒక సెంటిమెంట్‌ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ)

చాలామంది ఈ రెండు సినిమాల గురించి సోషల్‌మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారని ఊర్వశి పేర్కొంది. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని అంటూనే ఊర్వశి రౌటేలా నటించిన డాకు మహారాజ్‌ సూపర్‌ హిట్‌ అయిందని చాలామంది తెలుపుతున్నారని ఆమె తెలిపింది. శంకర్ సర్ చాలా ప్రసిద్ధ దర్శకుడని ఆమె చెప్పింది. ఆయనతో ఇండియన్ 2లో కూడా పనిచేశానని గుర్తుచేసింది. ఆ సినిమాకు కూడా మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. కానీ, అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేదని ఆమె అభిప్రాయపడింది.

వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. సుమారు రూ. 450 కోట్లతో దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి  శంకర్ దర్శకత్వం వహించారు.  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్‌ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకు గేమ్‌ ఛేంజర్‌ (10రోజులు) ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించినట్లు సక్నిల్క్ వెల్లడించింది. అయితే, తొలి రోజే ఈ చిత్రానికి రూ. 186 కోట గ్రాస్‌  వచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. దాంతో సోషల్‌మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కలెక్షన్స్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)