Breaking News

కథ విన్నప్పుడే థ్రిల్‌ అయ్యాను: నటుడు ఉపేంద్ర

Published on Sat, 11/29/2025 - 01:03

‘‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమా కథ విన్నప్పుడు  థ్రిల్‌ అయ్యాను. ఎమోషనల్‌గా అద్భుతంగా అనిపించింది. కానీ ఈ సినిమా టైటిల్‌ చెప్పినప్పుడు కాస్త టెన్షన్ గా అనిపించింది. నేనెలా ఆంధ్ర కింగ్‌ అవుతానని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్‌. నేను కింగ్‌లా ఫీల్‌ అవుతున్నాను అంటే అది మీ (ప్రేక్షకులు, అభిమానులను ఉద్దేశించి) గొప్పతనం’’ అని ఉపేంద్ర అన్నారు. రామ్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.

తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్‌ మీట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ఇంత మంచి స్పందన ఇస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. మహేశ్‌గారు అద్భుతమైన సినిమా తీశారు. హీరో, ఆ హీరో అభిమాని మధ్య ఉన్న డివైన్  ఎమోషన్ ని చక్కగా చూపించారు. నా ఫ్యాన్  సాగర్‌ (సినిమాలో రామ్‌ పాత్ర), మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్‌ చేస్తున్నారు’’ అన్నారు.

‘‘ఈ చిత్రంలో రామ్, ఉపేంద్రగార్లు ఓ మ్యాజిక్‌ చేశారు. మంచి టీమ్‌తో పని చేసినప్పుడు వండర్స్‌ జరుగుతాయి. అలాంటి వండర్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. నన్నో బ్రదర్‌లా చూసుకున్న నిర్మాతలు నవీన్ , రవిశంకర్‌గార్లకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను’’ అని తెలిపారు పి. మహేశ్‌బాబు. ‘‘ఈ చిత్రంలోని రామ్, ఉపేంద్రగార్ల కాంబినేషన్  సీన్స్, వారి నటన గురించి అభినందనలు వస్తున్నాయి. దర్శకుడిగా మహేశ్‌కి మంచి పేరు వచ్చింది. ఇది చాలా లాంగ్‌ రన్  ఉన్న సినిమా’’ అని అన్నారు వై. రవిశంకర్‌. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ , మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వివేక్‌–మెర్విన్  మాట్లాడారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)