Breaking News

ఆ హీరోయిన్‌ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర

Published on Sat, 07/26/2025 - 12:24

కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర(Upendra ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్‌ అవ్వడమే కాకుండా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచినవి కూడా ఉన్నాయి. ఫలితం ఎలా ఉన్నా సరే ఆయన సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్‌ కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘ఏ’ నుంచే ఆయన ప్రయోగాలు ప్రారంభించాడు. అప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ‘ఏ’ సినిమా కథనం సాగుతుంది. అందుకే కన్నడతో పాటు తెలుగులోనూ ఆ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ అ‍వ్వడానికి ఉపేంద్ర చాలా కష్టపడాల్సి వచ్చిందట. 

సీనియర్నటి సరోజా దేవి లేకపోతే సినిమానే రిలీజ్అయ్యేది కాదని, ఇప్పుడు మీ కళ్ల ముందు ఇలా హీరోగా నేను ఉండేవాడినే కాదని ఆయన అన్నారు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన దివంగత నటి సరోజా దేవి సంతాప సభలో ఉపేంద్ర మాట్లాడుతూ.. సరోజ వల్లే తాను హీరో అయ్యానని చెప్పాడు. ‘నేను దర్శకత్వం వహించి నటించిన తొలి సినిమాకి సెన్సార్సమస్య వచ్చింది. ఇలాంటి సినిమాని రిలీజ్చేయకూడదని చాలా మంది అన్నారు

సెన్సార్తిరస్కరించడంతో రివిజింగ్కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. సమయంలో సరోజా దేవి నాకు తోడుగా నిలిచింది. సినిమా చూసిన తర్వాత నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్లగానే సరోజా దేవి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె కారణంగానే మా సినిమాకు సెన్సార్పూర్తయింది. ఆమెను కలిసిన ప్రతిసారి విషయం గుర్తు చేసేవాడిని. ‘మీరే లేకపోతేను నేను హీరో అయ్యేవాడ్ని కాదుఅని ఆమెకు చెప్పేవాడిని. రాజ్ కుమార్, విష్ణువర్థన్ మాత్రమే కాదు.. సరోజా దేవి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలి. ఆమె రెండు సార్లు సెంట్రల్ జ్యూరీ మెంబర్‌గా కూడా పని చేశారు. ఆమె సాధించిన విజయాలు ఏంటో అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు’ అని అని ఉపేంద్ర అన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)