Breaking News

ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్

Published on Tue, 01/30/2024 - 16:46

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతా సినిమాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రిపబ్లిక్ డే కానుకగా తలో డబ్బింగ్, హిందీ మూవీ రిలీజ్ అయ్యాయి గానీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ శుక్రవారం పదికి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిలో ఏ మూవీకి హైప్ ఉంది?

ఫిబ్రవరి 2న 10 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ మాత్రం ఉన్నవాటిలో కాస్త ఆసక్తి రేపుతోంది. వరసపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న చిత‍్రబృందం.. సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. దీని తర్వాత 'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటించి, నిర్మించిన 'బూట్ కట్ బాలరాజు' కూడా ఉన్నంతలో బెటర్ మూవీ. ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బుల్లేవని సొహైల్ చెప్పాడు. పూర్తిగా కామెడీని నమ్ముకుని వస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

పై రెండు సినిమాలతో పాటు కామెడీని నమ్ముకున్న 'కిస్మత్', లక్ష్ చదలవాడ ధీర', థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'గేమ్ ఆన్' రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'హ్యాపీ ఎండింగ్', 'మెకానిక్', 'ఉర్వి', 'చిక్లెట్స్', 'శంకర' చిత్రాలు కూడా ఫిబ్రవరి 2నే బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. అయితే వీటికి థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు కానీ హిట్ అయ్యే విషయంలోనే అసలు సమస్య ఉంటుంది.

ఎందుకంటే మరీ అంత బాగుంటే తప్పితే జనాలు ఈ పది సినిమాల్లో ఒక్కదానిపై అయిన ఆసక్తి చూపించరు. దీనికితోడు వచ్చేవారం థియేటర్లలోకి రవితేజ 'ఈగల్', యాత్ర 2, రజనీకాంత్ 'లాల్ సలామ్' రాబోతున్నాయి. మరి వీటికోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల్ని.. ఈ వారం థియేటర్లలోకి తీసుకొచ్చే సినిమా ఏది? హిట్ అయ్యే మూవీ ఏది అనేది చూడాలి?

(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)