Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు

Published on Sun, 12/03/2023 - 23:35

మరోవారం వచ్చేసింది. అలానే బయట చలి చంపేస్తుంది భయ్యా! ఇలాంటి టైంలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే కచ్చితంగా సూపర్ ఉండాలి. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు.. ప్రేక్షకుల్ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి సరంజామా సిద్ధం చేశాయి. థియేటర్లలో 'హాయ్ నాన్న', 'ఎక్స్‌ట్రా' మూవీస్ వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?)

ఇక ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. 'జిగర్ తాండ డబుల్ ఎక్స్', 'కూసే మునిస్వామి వీరప్పన్' మూవీలతో పాటు 'వధువు' సిరీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి మూడే ఉన్నప్పటికీ వీకెండ్ వచ్చేసరికి ఈ లిస్టులో మరిన్ని తెలుగు చిత్రాలు చేరే ఛాన్స్ ఉంది. అలానే 'ద ఆర్చిస్', 'కడక్ సింగ్' లాంటి హిందీ మూవీస్ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానున్నాయి. ఇంతకీ ఓవరాల్ గా ఏయే సినిమా/వెబ్ సిరీస్ ఏ ఓటీటీల్లో రానుందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్-వెబ్ సిరీస్‌ (డిసెంబరు 04 నుంచి 10వ తేదీ వరకు)

అమెజాన్ ప్రైమ్

  • డేటింగ్ శాంటా (స్పానిష్ సినిమా) - డిసెంబరు 07
  • మన్ పసంద్ (స్టాండప్ కామెడీ స్పెషల్) - డిసెంబరు 07
  • మస్త్ మైన్ రహనే కా (హిందీ మూవీ) - డిసెంబరు 08
  • మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - డిసెంబరు 08
  • యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 08

నెట్‌ఫ్లిక్స్

  • డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 04
  • స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 05
  • బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - డిసెంబరు 06
  • క్రిస్మస్ యాజ్ యూజ్‌వల్ (నార్వేజియన్ మూవీ) - డిసెంబరు 06
  • అనలాగ్ స్క్వాడ్ (థాయ్ సిరీస్)- డిసెంబరు 07
  • హై టైడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07
  • హిల్డా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07
  • ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్) - డిసెంబరు 07
  • మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07
  • సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 07
  • ద ఆర్చీస్ (హిందీ మూవీ) - డిసెంబరు 07
  • వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07
  • దక్ దక్ (హిందీ మూవీ) - డిసెంబరు 07
  • జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 08
  • లీవ్ ద వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - డిసెంబరు 08

సోనీ లివ్

  • చమక్ (హిందీ సిరీస్) - డిసెంబరు 07

లయన్స్ గేట్ ప్లే

  • డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 07

బుక్ మై షో

  • బ్లాక్ బెర్రీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 06
  • ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • సౌండ్ ట్రాక్ #2 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 06
  • హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07
  • డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08
  • వధువు (తెలుగు సిరీస్) - డిసెంబరు 08
  • ద మిషన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10

జీ5

  • కడక్ సింగ్ (హిందీ సినిమా) - డిసెంబరు 08
  • కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 08

జియో సినిమా

  • స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10

(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)