Breaking News

లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లో ఇద్దరు హీరోయిన్లు, ఇప్పుడిదే ట్రెండ్‌!

Published on Tue, 06/14/2022 - 08:10

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్‌ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్‌ ఓరియంటెడ్‌’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్‌ ఓరియంటెడ్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్‌ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్‌ ఓ రోడ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేశారు. నటుడు, దర్శకుడు, రచయిత ఫర్హాన్‌ అక్తర్‌ ఈ రోడ్‌ మ్యాప్‌కు డిజైనర్‌. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రియాంక, కత్రినా, ఆలియాలది పర్సనల్‌ ట్రిప్‌ కాదు.. ప్రొఫెషనల్‌ ట్రిప్‌. ఈ ముగ్గురూ కలిసి రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘జీ లే జరా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. విశేషం ఏంటంటే.. పదేళ్ల తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌ ‘జీ లే జరా’తో మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు. షారుక్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘డాన్‌ 2: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ తర్వాత ఫర్హాన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే.

ఇక ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్‌ల రోడ్‌ ట్రిప్‌ను ఫర్హాన్‌ అక్తర్‌ ప్లాన్‌ చేస్తే.. హీరోయిన్లు దియా మిర్జా, సంజనా సాంఘీ, రత్నా పాఠక్‌ షాల రోడ్‌ ట్రిప్‌ మ్యాప్‌ను రైటర్‌ తరుణ్‌ దుడేజా రెడీ చేశారు. ఈ ట్రిప్‌కు ‘ధక్‌ ధక్‌’ అని టైటిల్‌ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బైక్స్‌పై ప్రయాణం చేయాలనుకునే ఈ ‘ధక్‌ ధక్‌’ టీమ్‌కు హీరోయిన్‌ తాప్సీ ఓ నిర్మాతగా సపోర్ట్‌ చేస్తుండటం విశేషం. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నలుగురు మహిళలు ఓ రోడ్‌ ట్రిప్‌లో కలుసుకున్నప్పుడు వారి ప్రయాణం ఏ విధంగా సాగింది? వారి అనుభవాలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది.

‘జీ లే జరా’, ‘ధక్‌ ధక్‌’ రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో సాగే సినిమాలైతే.. ‘కరుంగాప్పియమ్‌’ సినిమా కథానాయికలు కాజల్‌ అగర్వాల్, రెజీనా, జనని, రైజా  విల్సన్, ఇరాన్‌ దేశ అమ్మాయి నోయిరికాలు హారర్‌ స్టోరీతో ప్రయాణం చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు మహిళలు ఓ కామన్‌ పాయింట్‌తో కలుస్తారు. అయితే వారిలో ఒకరికి  అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఒకరికి అతీంద్రియ శక్తులు ఉన్న విషయం మిగతావారికి  తెలిసినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ శక్తులు ఎంత ఉపయోగపడ్డాయి? అనే అంశాల నేపథ్యంలో ‘కరుంగాప్పియమ్‌’ చిత్రకథ సాగుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇంకోవైపు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్లాన్‌ వేస్తున్నారు శాకిని అండ్‌ డాకిని. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని–డాకిని’. సుధీర్‌ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్‌ కొరియన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇద్దరు లేడీ ట్రైనీ పోలీసాఫీసర్లు కిడ్నాపింగ్‌ అండ్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా ఆటకట్టించడంలో ఎలా భాగస్వామ్యమయ్యారు అన్నదే కథ. ఇవే కాదు.. మరికొన్ని ‘లేడీస్‌ ఓరియంటెడ్‌’ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి.

చదవండి: కొడుకు ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌.. ఈసారి ముఖం కనిపించేలా
కోవిడ్‌కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను: హీరోయిన్‌

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)