Breaking News

రామచ్‌రణ్‌పై విమర్శలు.. స్పందించిన ఉపాసన

Published on Wed, 11/20/2024 - 14:43

మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్‌ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్‌ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్‌ నేషన్‌.. వన్‌ స్పిరిట్‌' అని తెలిపారు.

రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్‌ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్‌ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్‌ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదల కానుంది.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు