Breaking News

ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన

Published on Sun, 06/12/2022 - 09:19

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్‌ అయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్‌గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె సినీ సెలబ్రెటీలు హీరోయిన్లు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో​ ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులు అర్పించారు.

చదవండి: నా సినిమా ఫ్లాప్‌ అయినా కూడా రానా బాగుందనేవాడు: కమల్‌ హాసన్‌

ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘మై బెస్టీ మై డియరెస్ట్‌ ఫ్రెండ్‌. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో ది బెస్ట్‌గా ఉండేది. ఇక కెరీర్‌, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: Prathyusha Garimella: ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య

కాగా  ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యూష తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. టాలీవుడ్‌లో శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్‌, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్‌ చరణ్‌లకు ఆమె కాస్ట్యూమ్‌  డిజైనర్‌గా వ్యవహరించారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోయిన్లకు సైతం ఆమె ఫ్యాషన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, మాధురి దీక్షిత్‌, విద్యాబాలన్‌కు కూడా వర్క్‌ చేశారు. ఆమె డిజైన్‌ చేసిన డ్రెస్సులను కూడా చాలా మంది సెలబ్రెటీలు ఎండార్స్‌ కూడా చేశారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)