Breaking News

'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్

Published on Wed, 01/29/2025 - 14:25

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్‌ పూర్తయ్యాక మా ఫేస్‌లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.

(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)

ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవే‍త్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ‍ఛేంజర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)