Breaking News

పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన ఉపాసన, ట్వీట్‌ వైరల్‌

Published on Thu, 01/12/2023 - 13:01

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని ఇటీవల మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉపాసన మూడు నెలల గర్భవతిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పుట్టబోయే బిడ్డ గురించి ట్వీట్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. కాగా  ప్రస్తుతం రామ్‌ చరణ్, ఉపాసనలు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నాటు నాటుకు పాటకు ఈ అవార్డు వరించింది.

చదవండి: అందుకే మీరు దళపతి అయ్యారు!: విజయ్‌పై షారుక్‌ ట్వీట్‌

దీనిని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎమ్‌ఎమ్‌ కీరవాణి అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆర్‌ఆర్‌ఆర్‌ టీం షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అవుతున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌, ఎన్టీర్‌, రాజమౌళి ఇలా ప్రతిఒక్కరు ఈ గ్రేట్‌ మూమెంట్‌ని సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఉపాసన సైతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో కలిసి ఈ హ్యాపీ మూమెంట్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా వారితో కలిసి లాస్‌ఎంజిల్స్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: థ్యాంక్యూ శ్రీవల్లి.. వేదికపై భావోద్వేగానికి గురైన ఎంఎం కీరవాణి

‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది. మన ఇండియన్‌ సినిమాకు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తూ విజయం సాధించారు. ఈ హ్యాపీ మూమెంట్‌లో నన్ను భాగం చేసిన రామ్‌చరణ్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాతో పాటు నా బిడ్డ కూడా ఈ గౌరవం పొందడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ మెగా ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కాగా 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్-ఉపాసనలు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతుండటంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్‌ సైతం మురిసిపోతున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)