Breaking News

మా తాత బర్త్ డే నాకెంతో ప్రత్యేకం.. వేదికపై ఉపాసన ఎమోషనల్!

Published on Wed, 02/07/2024 - 17:35

భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిన ప్రముఖ వైద్యుడు, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్‌ సీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. అలాంటి ప్రతాప్‌ సీ రెడ్డి తన అపోలో ఆస్పత్రి సేవలను దేశంవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 5వ తేదీన ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన మనవరాలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్‌ బుక్‌ను డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్ రావ‌డం ప‌ట్ల ఎలా అనిపిస్తుంద‌ని ఉపాసనను ప్రశ్నించారు. దీనికి ఉపాస‌న చెప్పిన స‌మాధానం వైర‌ల్‌గా మారింది.

ఉపాసన మాట్లాడుతూ.. 'మా గ్రాండ్ ఫాద‌ర్‌ మాత్ర‌మే కాదు.. ఇప్పుడు క్లీంకార గ్రాండ్ ఫాద‌ర్‌ కూడా ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్ద‌రు ఈ పుర‌స్కారం అందుకోవ‌డం నిజంగా ఎంతో గౌర‌వంగా భావిస్తున్నా.  మా తాత జన్మదినం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజును భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలలు కనే యువ వ్యాపారవేత్తలు, మహిళలతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వైద్య రంగంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఆయన కలలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తామని' ఉపాసన పేర్కొన్నారు. కాగా..  సినీ రంగంలో చేసిన సేవ‌ల‌కు మెగాస్టార్ చిరంజీవిని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం దేశ రెండో అత్యున్న‌త పుర‌స్కారం ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించింది. అంతకుముందు 2010లో ప్ర‌తాప్ చంద్ర రెడ్డి కూడా ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Videos

ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ దద్దరిల్లిన హైదరాబాద్

సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు

వైభవ్ మాస్ రివెంజ్ తిలక్ కు దిమ్మతిరిగే షాక్

నీకూ అర్చనకు ఎన్ని గొడవలు.. కిట్టు మాట్లాడుతుంటే పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్

ప్రభాస్ కు KTR ప్రాంక్ కాల్

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

Photos

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)