ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి
Breaking News
‘పెద్ది’ గాడి మాస్ ఎంట్రీ.. థియేటర్స్‌లో పేపర్లు ఎగరేసిన ఉపాసన
Published on Thu, 06/04/2026 - 12:32
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం పెద్ది థియేటర్స్‌లో సందడి చేస్తోంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అంటే నిన్న(జూన్ 3) రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మెగా అభిమానులంతా థియేటర్స్‌కి పోటెత్తారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా నిన్న రాత్రే సినిమా చూశారు.
హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్న విమల్ థియేటర్స్‌లో అభిమానుల మధ్య ఉపాసన తన స్నేహితులతో కలిసి సినిమా వీక్షించారు. పెద్ది పాత్ర ఎంట్రీ కాగానే ఫ్యాన్స్‌తో కలిసి పేపర్లు ఎగరేస్తూ, ఆనందంతో గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక మెగా అభిమానులు అయితే రాత్రి నుంచే నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సినిమా చూసిన వారిలో చాలా మంది చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. రెహమాన్ బీజీఎంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ మొత్తంలో ఇప్పుడు పెద్ది గురించే చర్చ కొనసాగుతోంది. మరి కలెక్షన్ల పరంగా పెద్ది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Upasana garu is throwing papers for RC’s entry ❤️ #Peddi #Ramcharan #Upasana pic.twitter.com/9g6Ng33eES
— justin telugu (@JustinTelu59343) June 3, 2026
Tags : 1