Breaking News

అందరూ ధనశ్రీని టార్గెట్‌ చేస్తే నేను సపోర్ట్‌ చేశా.. అప్పుడు..: ఉర్ఫీ

Published on Sun, 03/09/2025 - 17:40

టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌, కొరియోగ్రాఫర్‌ ధన శ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోతున్నారంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి పుకార్లు ఊపందుకున్నాయి. చివరకు ఆ పుకార్లను నిజం చేస్తూ ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఇటీవలే వీరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట డివోర్స్‌ తీసుకోనుంది అన్నప్పటినుంచి చాలామంది ధనశ్రీని టార్గెట్‌ చేశారు.

ప్రతిసారి అమ్మాయిదే తప్పా?
చాహల్‌ను ఒంటరిని చేసిందని, ధనశ్రీ ఏదో తప్పు చేసుంటుందని.. రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సోషల్‌ మీడియా సెన్సేషన్‌, నటి ఉర్ఫీ జావెద్‌ (Uorfi Javed) ధనశ్రీకి మద్దతుగా నిలిచింది. చాహల్‌ జీవితాన్ని ధనశ్రీ నాశనం చేసిందన్న పోస్టుపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రికెటర్‌ బ్రేకప్‌ చెప్పినప్పుడు, విడాకులు తీసుకుంటున్నప్పుడల్లా అమ్మాయిదే తప్పని ముద్ర వేస్తారు. ఆమెపైనే నిందలేస్తారు. ఎందుకంటే మనకు క్రికెటర్‌ అంటే హీరో కదా! 

మీకు గుర్తుందా?
నిజంగా ఆ జంటల మధ్య ఏం జరిగిందనేది మనకెవరికీ తెలియదు. విరాట్‌ సరిగా ఆడకపోయినా కూడా అనుష్కదే తప్పన్నారు. మీకు గుర్తుందో, లేదో మరి! అంటే అక్కడ మగవాడు ఏం చేసినా అందుకు మహిళలే కారణం.. ఈ అబ్బాయిలేం చిన్నపిల్లలు కాదు. వాళ్లేం చేస్తున్నారో వారికి అన్నీ బాగా తెలుసు అని రాసుకొచ్చింది.

ధనశ్రీకి సపోర్ట్‌ చేశానని..
ఈ పోస్ట్‌ చూసిన ధనశ్రీ తనకు థాంక్స్‌ చెప్పిందంటోంది ఉర్ఫీ జావెద్‌. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ విడాకుల వ్యవహారంలో ధనశ్రీని దారుణంగా చిత్రీకరించారు. అప్పుడామెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్‌ చేశాను. అప్పటికే బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ఆమె అది చూసి నాకు కృతజ్ఞతలు తెలియజేసింది అని తెలిపింది.

చదవండి: దారి తెలీక ఆగిపోయా.. అప్పుడు సమంత సాయం చేయడం వల్లే..: నటుడు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)