Breaking News

చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!

Published on Sun, 07/02/2023 - 17:07

ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన కోలీవుడ్ చిత్రం మామన్నన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మరి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా సక్సెస్‌ కావడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అయితే ఈ చిత్రమే ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో చివరి చిత్రంగా నిలవనుంది. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడికి హీరో సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చారు.

(ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!)

చివరి చిత్రం సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మరి సెల్వరాజ్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్‌ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే ఈ కారు విలువు దాదాపు రూ.40 నుంచి 45 లక్షల ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉదయ్ తన ట్వీట్‌లో రాస్తూ..'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్‌కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు.  అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువ తరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది. మరి సెల్వరాజ్‌ సార్‌కి మినీ కూపర్ కారును అందించడం ఆనందంగా ఉంది. మామన్నన్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు  సెల్వరాజ్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. 

(ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! )

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)