Breaking News

నాకు మొదటి ఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను

Published on Tue, 08/05/2025 - 16:07

టాలీవుడ్ యాంకర్ ఉదయభాను కేవలం యాంకరింగ్‌ మాత్రమే కాదు.. నటిగానూ అభిమానులను మెప్పించింది. పలు చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉదయభాను నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్‌ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీలో ఉదయభాను ఛాలెంజింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మెగాస్టార్‌ బర్త్‌ డే రోజున అంటే ఆగస్ట్ 22న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌కు హాజరైన ఉదయభాను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ గురించి కూడా మాట్లాడారు. చిరంజీవికి తానంటే చాలా ఇష్టమని తెలిపారు. నన్ను అభినందించి మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది చిరంజీవినే అని ఉదయభాను వెల్లడించారు. ఈ విషయాన్ని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. మా సినిమా మెగాస్టార్‌ బర్త్‌ డే రోజు విడుదలవ్వడం ఆనందంగా ఉందని ఉదయభాను సంతోషం వ్యక్తం చేశారు.

ఇటీవల యాంకర్‌గా మిమ్మల్ని తొక్కేస్తున్నారని చేసిన కామెంట్స్‌పై ఉదయభానుకు ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ నేనెప్పుడు నిజాలే మాట్లాడతానని ఉదయభాను అన్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడానికి ఇది సందర్భంగా కాదని తెలిపారు. ఈ విషయంపై ఎవరిని అడిగినా నిజాలే మాట్లాతారని ఉదయభాను అన్నారు.

కాగా.. సత్యరాజ్ లీడ్‌ రోల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌. ఈ సినిమాకు మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో  సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్‌.సింహ, సాంచి రాయ్ కీలకపాత్రల్లో నటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)