పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!

Published on Sun, 06/08/2025 - 15:16

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా జూలైలో రిలీజ్ ఉండొచ్చు. మార్కెట్‌లో చూసుకుంటే ఈ సినిమాపై అసలు బజ్ లేదు. మొన్నీమధ్య అంటే శుక్రవారం మచిలీపట్నంలో మూవీ ఈవెంట్ జరగ్గా.. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఓ విషయాన్ని మర్చిపోయిన ఈమె.. ఓ రకంగా మూవీ పరువు తీసేసిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?

పవన్ 'హరిహర..' సినిమా నుంచి ఇదివరకే రెండు మూడు పాటలు రిలీజయ్యాయి కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్‌ని యాంకరింగ్ చేసిన ఉదయభాను, డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని.. ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి.. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అని ఏమీ తెలియనట్టుగా అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏం అనాలో తెలీక బిక్కమొహం వేశాడు.

(ఇదీ చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్‌బీ..)

ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ పాడిన 'మాట వినాలి' అనే పాటనే తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్‌కి యాంకరింగ్ చేస్తున్న ఉదయభానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడిక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ.. పాట గురించి చెప్పుకొచ్చారు. అలానే ఇదే ఈవెంట్‌లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంటసేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు.

అప్పుడెప్పుడో 2020లో మొదలైన ఈ సినిమా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ముగించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఎక్కడలేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీమ్ అంటోంది గానీ మూవీ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ప్రభాస్‌ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)