Breaking News

హను–మాన్‌లో అదే పెద్ద సవాల్‌

Published on Tue, 01/23/2024 - 00:43

ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్‌ ‘హను–మాన్‌’లో మేజర్‌ హైలైట్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్‌ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మేజిక్‌ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్‌లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్‌కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్‌ చేసిన పెద్ద సవాల్‌ అంటున్నారు వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు ఉదయ్‌ కృష్ణ.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్‌’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ చేసిన ఉదయ్‌ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్‌ ఎఫెక్ట్స్‌లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్‌’ చిత్రం చేసే చాన్స్‌ రావడం పూర్వజన్మ సుకృతం.

వీఎఫ్‌ఎక్స్‌ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్‌ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్‌ బెల్స్‌’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్‌’, ‘పద్మావత్‌’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్‌ ఫిల్మ్‌ ‘అర్జున్‌: ది వారియర్‌ ప్రిన్స్‌’, పూర్తి స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ మూవీ ‘అల్లాదీన్‌’ వంటివి చేశానని ఉదయ్‌కృష్ణ తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)