Breaking News

ఆ సినిమా రీమేక్‌ హక్కులు సూర్య సొంతం

Published on Fri, 11/17/2023 - 06:30

కథానాయకుడుగాను, నిర్మాతగాను దూసుకెళుతున్న నటుడు సూర్య. నటుడిగా నిర్మాతగా ఈయన గ్రాఫ్‌ చూస్తుంటే ఎవరికై నా ఈర్ష్య కలగక మానదు. కారణం సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా), జైభీమ్‌ వంటి చిత్రాలు సంచలన విజయాలే. తాజాగా 'కంగువ' అనే మరో సూపర్‌ హిట్‌ కథా చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తొలిసారిగా ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

మరోపక్క తాను తమిళ్‌,తెలుగులో నటించి, నిర్మించిన సూపర్‌ హిట్‌ సినిమా సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సూర్య త్వరలో సుధా కొంగర దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటించే 43వ చిత్రం అవుతుంది మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్‌సల్మాన్‌, విజయ్‌వర్మ, నటి నజ్రియా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం కంగువా చిత్ర షూటింగ్‌ పూర్తి అయిన తరువాత సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

తాజాగా హిందీలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘టువల్త్‌ ఫైల్‌’ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను సూర్య పొందినట్లు సమాచారం. యదార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు విను వినోద్‌ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర తమిళ్‌ రీమేక్‌లో సూర్య నటిస్తారా లేక మరో నటుడిని నటింపజేస్తారా వేచి చూడాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)